నామినేషన్ వేసిన బండి సంజయ్.. హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి
- కరీంనగర్ లోక్ సభ స్థానానికి బండి సంజయ్ నామినేషన్
- నామినేషన్ తర్వాత భారీ ర్యాలీ
- కరీంనగర్ లో తానే లోకల్ అన్న సంజయ్
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్ లో తాను లోకల్ అని, బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా గుర్తు పట్టని పరిస్థితి ఉందని అన్నారు. తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ. 12 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని... నియోజకర్గ ప్రజల మద్దతు తనకే ఉందని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశం మొత్తం ప్రధాని మోదీ వైపు చూస్తోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. మరోసారి బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని కోరారు.