కవిత బెయిల్ పిటిషన్‌లపై తీర్పును రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
- సీబీఐ కేసులో మే 2వ తేదీన, ఈడీ కేసులో మే 6న తీర్పు ఇవ్వనున్న కోర్టు
- కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ సుదీర్ఘ వాదనలు వినిపించిన విచారణ సంస్థలు
- ఏప్రిల్ 26లోగా రిజాయిండర్ దాఖలు చేయనున్న కవిత తరఫు న్యాయవాదులు
ఈడీ తరఫు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు బెయిల్ ఇవ్వవద్దని వాదనలు వినిపించారు. ఏప్రిల్ 26వ తేదీలోగా కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేయనున్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పస లేదని, మద్యం కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ సంస్థలు కోర్టులో వాదనలు వినిపించాయి.