కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల
- అంతకుముందు ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద నివాళులు
- సునీతతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
- కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నానన్న షర్మిల
అంతకుముందు షర్మిల ఎక్స్‌లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.