జగన్ పై దాడి కేసులో బొండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: వెల్లంపల్లి
- బొండా ఉమకు ఓటమి భయం పట్టుకుందన్న వెల్లంపల్లి
- జగన్ పై ఉమ అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య
- బొండా ఉమకు డిపాజిట్ కూడా రాదన్న వెల్లంపల్లి
జగన్ పై రాయి దాడి కేసులో బొండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక ప్రజలే లేరని... ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు ఉమ అని అన్నారు. జగన్ పై బొండా ఉమా అనుచరులు దాడి చేయడంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. జగన్ పై రాయి విసిరారని బొండా ఉమ ఒప్పుకున్నారని.. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.
నిన్న రాత్రి టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ రోడ్డుపై బైఠాయించారని వెల్లంపల్లి విమర్శించారు. పెద్ద నాటకం సృష్టించారని దుయ్యబట్టారు. బొండా ఉమకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.