ధోని బ్యాటింగ్ కు వస్తుంటే దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్ వాచ్ లో వార్నింగ్
- తాత్కాలిక వినికిడి లోపం తలెత్తే ముప్పుందని హెచ్చరిక
- శబ్దాల తీవ్రత 95 డెసిబిల్స్ కు చేరిందని క్రికెటర్ డికాక్ భార్య వెల్లడి
- తన వాచ్ లో వార్నింగ్ అలర్ట్ ను ఫొటో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన శాషా
లఖ్ నవూలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన శాషా.. ధోనీ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు. సీఎస్కే తరఫున చివరి ఓవర్లలో ధోనీ బ్యాటింగ్ కు వస్తుంటే ఏకనా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పారు. ధోనీ ధోనీ అంటూ అభిమానుల అరుపులతో శబ్ద తీవ్రత పీక్ కు వెళ్లిపోయిందన్నారు.