కడియంను భూస్థాపితం చేసేవరకు వదిలేదిలేదు.. రేవంత్ రెడ్డీ! ఆయనతో జాగ్రత్త: మీసం మెలేస్తూ రాజయ్య ఆగ్రహం
- రేవంత్ రెడ్డి తన పక్కనే భస్మాసురుడుని పెట్టుకున్నందున అప్రమత్తంగా ఉండాలన్న రాజయ్య
- నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరి అంతు చూస్తానని హెచ్చరిక
- రాజీనామా చేసి వస్తే చూసుకుందామని తొడగొట్టి సవాల్
కడియంకు నిజాయతీ ఉంటే రాజీనామా చేసి రావాలని... ఎన్నికల్లో చూసుకుందామని మీసం మెలేసి, తొడగొట్టి సవాల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అందరూ మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారని... దమ్ముంటే రాజీనామా చేసి రావాలన్నారు. నాకు నేనుగా రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం అని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇప్పుడు తనకు ఉన్న పని అంతా ఆయనను రాజకీయంగా తొక్కుడే అన్నారు. కడియం శ్రీహరి దళితద్రోహి... నమ్మకద్రోహి... డిక్టేటర్... గుంటనక్క అని తీవ్రస్థాయిలో విమర్శించారు.