శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడిన టీడీపీ దర్శి అభ్యర్థి డా.లక్ష్మి
- దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు
- అత్యవసరంగా ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడిన డా.గొట్టిపాటి లక్ష్మి
- ఆసుపత్రి వైద్యురాలు సుదూరాన ఉండటంతో తనే స్వయంగా ఆపరేషన్ చేసిన వైనం
మరోవైపు ఆసుపత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది గర్భిణి పరిస్థితి గురించి డా. లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. గైనకాలజిస్టయిన డా. లక్ష్మి వెంటనే స్పందించారు. ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. దీంతో, మహిళ బంధువులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.