ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం
- 9 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్
- అద్భుతంగా పోరాడిన పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ.. అయినా తప్పని ఓటమి
- తలో మూడు వికెట్లు తీసిన ముంబై బౌలర్లు కోయిట్జి, బుమ్రా, మధ్వల్
- బ్యాటింగ్‌లో 78 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్
పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ (6), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (0), రూసో (1), లియామ్ లివింగ్‌స్టోన్ (1), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (13), శంకర్ సింగ్ (41), జితేశ్ శర్మ (9), ఆశుతోశ్ శర్మ (61), హర్‌ప్రీత్ బ్రార్ (19), కగిసో రబాడ (8) అర్షదీప్ సింగ్ (1) చొప్పున పరుగులు చేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై భారీ స్కోర్ సాధించడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 78 పరుగులు బాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34 నాటౌట్), టిమ్ డేవిడ్ (14), హార్ధిక్ పాండ్యా (10), ఇషాన్ కిషన్ (8), షెఫర్డ్ (1), నబీ (0) చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రాన్ 2, రబాడ 1 చొప్పున వికెట్లు తీశారు.