నా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్
- మంగళగిరిలో నేడు లోకేశ్ తరఫున నామినేషన్ వేసిన కూటమి నేతలు
- మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం అంటూ లోకేశ్ ట్వీట్
- మంగళగిరిలో విజయంతో చరిత్ర లిఖిద్దాం అంటూ పిలుపు
"ఇవాళ మంగళగిరిలో నా తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన మంగళగిరి ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం. మనం చేయి చేయి కలిపి మంగళగిరిలో విజయంతో కొత్త చరిత్రను లిఖిద్దాం. దశాబ్దాల దుష్ట పాలన నుంచి మంగళగిరికి విముక్తి కల్పిద్దాం" అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.


