ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ!

 woman rides crowded Delhi bus in bikini
  • ఒక్కసారిగా అవాక్కయిన ప్రయాణికులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • నెటిజన్ల నుంచి వ్యక్తమైన భిన్న స్పందనలు
ఢిల్లీలో ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె డ్రెస్ ను చూసి అవాక్కయిన కొందరు ప్రయాణికుల స్పందన సైతం వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది. బికినీలో మహిళను చూసి షాక్ కు గురయ్యామని కొందరు పేర్కన్నారు. ఆమె తీరును అభ్యతరకరంగా అభివర్ణించారు.

 అయితే మరికొందరు మాత్రం ఆ మహిళను వెనకేసుకొచ్చారు. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఇందుకు సంబంధించిన వీడియో దర్శనమిచ్చింది. ఆ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోయాడు.

లక్షల్లో వ్యూస్.. భారీగా కామెంట్లు..

ఈ వీడియోకు 5.3 లక్షల వ్యూస్ లభించాయి. అలాగే వీడియో కింద భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా ఆమె ఉందామనుకున్నట్లు కనిపిస్తోందని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొకరేమో ఇదేం ఖర్మ.. ఎందుకిలా? అని స్పందించాడు. “అది ఆమె శరీరం.. ఆమె ఇష్టం. ఆమె మానాన ఆమెను వదిలేయండి” అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. “ఇక చాలు. నేను ఎక్స్ లో అన్నీ చూసేశాను. ఇక నా వల్ల కాదు” అని నాలుగో వ్యక్తి కామెంట్ పోస్ట్ చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొందరు యూజర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. గతంలో ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. రైలు ప్రయాణికులు సమాజ పద్ధతులను ఫాలో కావాలని కోరారు.
Advertisement
delhi
woman
bikini
viral video

More Telugu News