లోక్‌సభ ఎన్నికల 4వ దశ గెజిట్ విడుదల!
- నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ
- ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ గడువు
- మే 13న పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్
ప్రభుత్వ గెజిట్ ప్రకారం, ఈ దశ నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా, మే 13న 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలి దశలో అత్యధికంగా 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.