కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
- కాళేశ్వరంలో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేఏ పాల్
- సీబీఐ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని డిమాండ్
- కాళేశ్వంలో అవినీతి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య
ఎన్నికల సమయంలో కాళేశ్వంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన సీఎం రేవంత్... ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు.