Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం, వెండి పానీపూరీలు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Gold and Silver Panipuri Videot goes Viral on Social Media
Advertisement
  • స‌రికొత్త‌ పానీపూరీల‌ను విక్ర‌యిస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారి
  • గోల్డ్‌, సిల్వ‌ర్‌ పూతతో తయారు చేసిన పానీపూరీలను అమ్ముతున్న వైనం
  • ఈ పానీపూరీల‌కు షరీట్‌గా నామక‌ర‌ణం
Advertisement
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టపడే చిరుతిండి పానీపూరీ. పానీపూరీ చూస్తే చాలు అంద‌రికీ నోరూరిపోతుంటుంది. అందుకే వీటికి ఉండే క్రేజ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో పానీపూరీలను తయారు చేసి క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు వీటి విక్రే‌త‌లు. ఇదే కోవ‌లో ఇప్పుడు కూసింత వెరైటీ పానీపూరీల తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో బంగారం, సిల్వర్ పానీపూరీలను విక్ర‌యించ‌డం మ‌నం చూడొచ్చు. ప్రస్తుతం సామాజిక‌ మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేయ‌క‌మాన‌దు. 

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ స‌రికొత్త‌ పానీపూరీల‌ను అమ్ముతున్నాడు. గోల్డ్‌, సిల్వ‌ర్‌ పూతతో తయారు చేసిన పానీపూరీలను అతడు విక్రయించ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా వేయ‌డం వీడియోలో ఉంది. వాటిని బంగారు రంగు ప్లేట్‌లోనే పెట్టి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు కొంద‌రు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమ‌ర్శిస్తున్నారు. కాగా, ఈ పానీపూరి పేరు షరీట్‌గా తెలుస్తోంది.
Advertisement
Advertisement
Panipuri
Gold
Silver
Social Media
Instagram

More Telugu News