నేనింకా మొదలే పెట్టలేదు.. ప్రతీకారంపై ‘ఆప్ కీ అదాలత్’లో రేవంత్ రెడ్డి వ్యాఖ్య
- ఇండియా టీవీ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- కేసీఆర్‌తో రాజకీయ వైరం సహా అనేక అంశాలపై స్పందించిన సీఎం
- తన ట్రేడ్ మార్క్ పంచులతో షోను రక్తికట్టించిన రేవంత్ రెడ్డి
ఈ షోలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా? అన్న రజత్ శర్మ ప్రశ్నకు తాను ప్రతీకారం ఇంకా మొదలే పెట్టలేదని సరదాగా వ్యాఖ్యానించారు. తనదైన ట్రేడ్ మార్క్ పంచులు, డైలాగులతో రేవంత్ రెడ్డి షోను ఆద్యంతం రక్తికట్టించారు.