ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు
- 2007లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు
- విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల జారీ
- కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో కేసు వివరాలను వెల్లడించలేదని దర్యాఫ్తులో వెల్లడి
ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అతనిపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాఫ్తులో వెల్లడైంది. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.