'అందమైన' పాటకు రాజ‌మౌళి దంప‌తుల డ్యాన్స్‌ రిహార్స‌ల్స్.. ఇదిగో వీడియో!

SS Rajamouli Dance with Rama Rajamouli Video goes Viral on Social Media
  • సోష‌ల్ మీడియాలో రాజ‌మౌళి దంప‌తుల డ్యాన్స్‌ రిహార్స‌ల్స్ వీడియో వైర‌ల్ 
  • మైత్రి మూవీ మేక‌ర్స్ సీఈఓ చెర్రీ కూతురు పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ చేసిన రాజ‌మౌళి దంప‌తులు
  •  ప్ర‌భుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒక‌టైన 'అంద‌మైన ప్రేమ‌రాణి' పాట‌కు రాజ‌మౌళి, ర‌మ‌ స్టెప్పులు 
టాలీవుడ్ ప్ర‌ముఖ దర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆయ‌న త‌న భార్య ర‌మ‌తో క‌లిసి డ్యాన్స్ రిహార్స‌ల్స్ చేస్తుండ‌డం మ‌నం చూడొచ్చు. ఇటీవ‌ల ఓ వివాహ వేడుక‌లో పాల్గొని రాజ‌మౌళి దంప‌తులు డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్స‌ల్స్ వీడియో తాజాగా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు అది కాస్తా వైర‌ల్ అవుతోంది.  

మైత్రి మూవీ మేక‌ర్స్ సీఈఓ చెర్రీ కూతురు పెళ్లి ఇటీవ‌ల ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో పాల్గొన్న రాజ‌మౌళి త‌న భార్య ర‌మ‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ప్ర‌ముఖ నృత్య‌ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒక‌టైన 'అంద‌మైన ప్రేమ‌రాణి' పాట‌కు ఈ క‌పుల్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్స‌ల్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబుతో చేసే సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు.   
Go Back to Shorts
SS Rajamouli
Dance
Rama Rajamouli
Viral Videos
Tollywood

More Telugu News