AP Intermediate Results: ఈ నెల 12న ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విడుద‌ల‌!

AP Intermediate Results on 12th
  • మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేసేందుకు ఏపీ ఇంటర్ బోర్డు స‌న్నాహాలు
  • ఇప్పటికే పూర్త‌యిన‌ జవాబు పత్రాల మూల్యాంకనం
  • బుధ‌వారం మ‌ధ్యాహ్నంతో పూర్తికానున్న ఫ‌లితాల‌కు సంబంధించి అంత‌ర్గ‌త ప‌నులు
  • ఇందులో ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తితే ఫ‌లితాల విడుద‌ల‌ ఒక‌ట్రెండు రోజుల ఆల‌స్యం
ఏపీ ఇంటర్ బోర్డు ఈ నెల 12వ తేదీన ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇక ఫ‌లితాల‌కు సంబంధించి అంత‌ర్గ‌త ప‌నులు బుధ‌వారం మ‌ధ్యాహ్నంతో పూర్తికానున్నాయి.

ఇందులో ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తితే ఫ‌లితాల విడుద‌ల‌ ఒక‌ట్రెండు రోజులు ఆల‌స్యం కానుంది. లేనిప‌క్షంలో 12న ఇంటర్మీడియ‌ట్ ఫ‌లితాలు వ‌చ్చేస్తాయి. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. ఒకేష‌న‌ల్‌, రెగ్యుల‌ర్ కలిపి ఫస్టియర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండియర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

More Telugu News

AP Intermediate Results
AP Intermediate Board
Andhra Pradesh
Inter Results