భువనగిరి లోక్ సభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి
- పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 6 గ్యారెంటీ పథకాలతో ముందుకు సాగుతున్నామని వెల్లడి
- ఆరు గ్యారెంటీలలో పేదలు, రైతులు, యువకులు, మహిళల కోసం ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడి
- కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామన్న కోమటిరెడ్డి
అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని... తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వారంతా యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామన్నారు.