Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

CM Revanth Reddy missed accident
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చ‌ర్ అయి పేలింది. కారు స‌డెన్‌గా ఆగింది. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఆయన కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద కారు టైర్ పంక్చర్ అయింది. కాన్వాయ్‌లోని వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Kodangal
Convoy

More Telugu News