ఈ విధంగా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కడే: నారా లోకేశ్
- మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
- ఆర్ఆర్ అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖి
- జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అంటూ విమర్శలు
- ప్రజలు ఎదగడం జగన్ కు ఇష్టముండదని వెల్లడి
"ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే... అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఈయన బటన్ నొక్కితేనే ప్రజలు బతికే పరిస్థితి నెలకొంది. నిజాం నుంచి చంద్రబాబు వరకు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇవాళ్టి రేవంత్ రెడ్డి వరకు ఎవరూ హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం... అతడెవరంటే... జగన్!" అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.