లిక్కర్ కేసులో కీలక పరిణామం... కవితను విచారించేందుకు కోర్టులో సీబీఐ పిటిషన్
- ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన ఈడీ
- ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత
- జైల్లోనే కవితను ప్రశ్నిస్తామన్న సీబీఐ
కవితను జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో సీబీఐ కోరింది. కోర్టు అనుమతి మంజూరు చేస్తే.. జైల్లోనే ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. కేసులో సాక్షిగా ఉన్నప్పుడు కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఆమెను సీబీఐ నిందితురాలిగా మార్చింది.