ఇషా అంబానీ ఇంటిని రూ. 494 కోట్ల‌కు కొన్న హాలీవుడ్ న‌టి.. ఆమె నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇషా అంబానీ ఇంటిని రూ. 494 కోట్ల‌కు కొన్న హాలీవుడ్ న‌టి.. ఆమె నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Meet actress who has bought Mukesh Ambani daughter Isha Ambani mansion for Rs 494 crore
  • లాస్ ఏంజిల్స్‌లోని త‌మ విలాసవంతమైన ఇంటిని జెన్నిఫర్ లోపెజ్ దంప‌తుల‌కు విక్ర‌యించిన ఇషా అంబానీ
  • బెవర్లీ హిల్స్ ప్రాంతంలో 5.2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల‌మైన‌ భవనం 
  • 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు, 155 అడుగుల ఇన్ఫినిటీ పూల్, ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, సెలూన్, జిమ్, స్పాలు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ భ‌వనం సొంతం
  • హాలీవుడ్ గాయ‌ని, న‌టి, డ్యాన్స‌ర్ అయిన జెన్నిఫర్ లోపెజ్ నెట్ వ‌ర్త్ 400 మిలియన్ డాలర్లు
భార‌త అప‌ర‌కుబేరుడు ముఖేశ్‌ అంబానీ, ఆయ‌న‌ భార్య‌ నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు 'యాంటిలియా'లో నివసిస్తార‌నే విష‌యం తెలిసిందే. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో కూడిన ఈ భ‌వ‌నం ఖ‌రీదు అక్ష‌రాల‌ రూ. 15,000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ దంప‌తుల‌ మాదిరిగానే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. 

ఇటీవల ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ లాస్ ఏంజిల్స్‌లోని తమ విలాసవంతమైన భవనాలలో ఒకదానిని హాలీవుడ్ న‌టి జెన్నిఫర్ లోపెజ్, ఆమె భ‌ర్త‌ బెన్ అఫ్లెక్‌లకు విక్రయించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇషా అంబానీ ఈ జంటకు  రూ. 494 కోట్ల భారీ మొత్తానికి ఇంటిని అమ్మిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇషా గర్భవ‌తిగా ఉన్న‌ సమయంలో లాస్ ఏంజెల్స్‌లోని ఈ ఇంట్లో ఎక్కువ‌ సమయం గడిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఇల్లు ఐదేళ్ల‌ పాటు మార్కెట్‌లో అమ్మ‌కానికి ఉండ‌గా.. ఇటీవల జెన్నిఫర్ లోపెజ్ దంప‌తులు దీన్ని కొనుగోలు చేశారు. 

ఇక అంబానీ ఫ్యామిలీకి చెందిన లాస్ ఏంజెల్స్‌లోని ఈ సువిశాల‌మైన‌ భవనం బెవర్లీ హిల్స్ ప్రాంతంలో 5.2 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో 155 అడుగుల ఇన్ఫినిటీ పూల్, ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, సెలూన్, జిమ్, స్పాలు త‌దిత‌ర‌ విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు, అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ పెవిలియన్, కిచెన్, లష్ లాన్‌లు ఉంటాయి.

జెన్నిఫర్ లోపెజ్ ఎవరు?
జెన్నిఫర్ లోపెజ్ ఒక అమెరికన్ గాయని, నటి, డ్యాన్స‌ర్‌. ఆమె డ్యాన్సర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ త‌ర్వాత 1991లో ఇన్ లివింగ్ కలర్స‌ లో ఫ్లై గర్ల్‌గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. అనంత‌రం ఆమె న‌టిగా ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించారు. 'సెలీనా' (1997), 'అనకొండ' (1997) వంటి చిత్రాలలో ప్ర‌ధాన‌ పాత్రలలో న‌టించి మంచి గుర్తింపు పొందారు. 'అవుట్ ఆఫ్ సైట్' (1998) ఆమెను అత్యధిక పారితోషికం పొందిన లాటిన్ నటిగా నిల‌బెట్టింది.

జెన్నిఫర్ లోపెజ్ గతంలో గాయకుడు మార్క్ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. అత‌నితో జూన్ 2004 నుండి జూన్ 2014 వరకు క‌లిసి ఉన్నారు. ఈ దంప‌తుల‌కు 2008 ఫిబ్రవరిలో కవలలు (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) జ‌న్మించారు. ఆ త‌ర్వాత‌ 2000 ప్రారంభంలో బెన్ అఫ్లెక్‌తో గతంలో డేటింగ్ చేశారు జెన్నిఫ‌ర్‌. దాంతో 2014లో మార్క్ ఆంథోనీతో విడిపోయిన త‌ర్వాత బెన్ అఫ్లెక్‌ను 2022 వివాహం చేసుకున్నారు. ఇక జెన్నిఫర్ లోపెజ్ త‌న‌దైన న‌ట‌న‌తో హాలీవుడ్‌లోని ప్ర‌ముఖ‌ తారలలో ఒకరుగా పేరొందారు. నివేదికల ప్రకారం జెన్నిఫర్ లోపెజ్ నెట్ వ‌ర్త్ వ‌చ్చేసి 400 మిలియన్ డాలర్లు. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ. 3000 కోట్లకు పైమాటే.
Advertisement
Isha Ambani
Jennifer Lopez
Mukesh Ambani
Mansion
Los Angeles

More Telugu News