Man Chases Mother: కన్నతల్లిని వెంబడించి మరీ కొట్టిన కొడుకు.. చోద్యం చూసిన జనం.. వీడియో ఇదిగో!

Man Chases Mother With Stick Beats Her Outside Temple In Bulandshahr
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లి రోడ్డుపై పరుగెడుతుంటే ఆమెను వెంబడించి మరీ కొట్టాడు. చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. సాయం చేయాలంటూ అరుస్తూ ఆ తల్లి పరిగెత్తడం చూస్తే హృదయం ద్రవించిపోతోంది. ఓ గుడి ఆవరణలో ఇదంతా జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ ఆ తల్లికి ఎవరూ సాయం చేయలేదు. చివరకు తల్లిని దొరకబుచ్చుకున్న ఆ యువకుడు కట్టెతో విచక్షణారహితంగా కొట్టాడు.

అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎట్టకేలకు స్పందించిన జనం.. ఆ యువకుడిని పట్టుకుని తల్లిని కాపాడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు యువకుడిని అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Go Back to Shorts
Man Chases Mother
Viral Videos
Uttar Pradesh
bulandshahr

More Telugu News