నా చివరి శ్వాస వరకు 'ఆ రోజు' నాతోనే ఉంటుంది.. 2011 ప్రపంచకప్ విక్టరీపై సెహ్వాగ్ ట్వీట్!
- వన్డే ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అయిన సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్
- వరల్డ్‌కప్ గెలిచిన ఆ క్షణాలను తన జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేనన్న భారత మాజీ క్రికెటర్
- కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన దినంగా అభివర్ణించిన డాషింగ్ ఓపెనర్
"కోట్లాది మంది భారతీయుల కల. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉండే ఆ రోజు. నా జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక రోజుకు నేటికి 13 ఏళ్లు" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక సెహ్వాగ్ కంటే ముందే సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విషయమై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.