సీఎం కేజ్రీవాల్ అభ్యర్థనలకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదం
- తీహార్ జైలులో 3 పుస్తకాలు, ఇంట్లో వండిన ఆహారానికి అనుమతి
- వైద్యుల సూచన మేరకు ఒక కుర్చీ, టేబుల్‌కు కూడా గ్రీన్ సిగ్నల్
- కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశం
జైలు మాన్యువల్ ప్రకారం వైద్యులు సూచించిన విధంగా ఒక టేబుల్, కుర్చీలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే జైలు నిబంధనల ప్రకారం వస్తువులు అన్నింటినీ జైలు అధికారులు పరిశీలిస్తుంటారని కోర్టు తెలిపింది. పుస్తకాలు, నోట్ప్యాడ్లు, పెన్నులు కావాలని కేజ్రీవాల్ కోరితే పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని నంబర్ 2 జైలులో ఉంచారు. ఇక్కడ 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంటుంది.
కాగా కేజ్రీవాల్ ఉదయం 6.30 గంటల మేల్కోవాల్సి ఉంటుందని జైలు వర్గాలు చెబుతున్నాయి. టీవీ సదుపాయం ఉందని, అయితే ప్రభుత్వ ఛానల్స్ మాత్రమే చూడాల్సి ఉంటుందని వివరించాయి. మరోవైపు మంగళవారం సాయత్రం 4 గంటలకు కేజ్రీవాల్ తన న్యాయవాదులను జైలులోనే కలవనున్నారు.