కవితకు ఇంటి భోజనం, ఆభరణాలు, మెడిటేషన్ కోసం జపమాలను అనుమతించిన కోర్టు
- కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు
- దుప్పట్లు, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలన్న కోర్టు
- మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాదులు
మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకోవడానికి అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం వెసులుబాట్లు అందించాలంటూ మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.