మొన్న అలా బాది... ఇవాళ మోదీ స్టేడియంలో విఫలమైన సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్

SRH batsmen disappointed against Gujarat Titans at Narendra Modi Stadium in Ahmedabad
  • మొన్న ముంబయితో మ్యాచ్ లో సన్ రైజర్స్ పరుగుల వెల్లువ
  • ఇవాళ గుజరాత్ టైటాన్స్ పై పేలవ బ్యాటింగ్ ప్రదర్శన
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, మొన్న సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఇవాళ తేలిపోయారు. గుజరాత్ టైటాన్స్ పై ఆశించిన మేరకు రాణించడంలో విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ 8 వికెట్లకు 162 పరుగులు  మాత్రమే చేసింది. 

ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించిన బ్యాటర్లు, నేడు పరుగులు తీసేందుకు చెమటోడ్చారు. ఎవరూ పెద్ద స్కోర్లు నమోదు చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, ట్రావిస్ హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్ క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29 పరుగులు చేశారు. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, అజ్మతుల్లా 1, ఉమేశ్ యాదవ్ 1, రషీద్ ఖాన్ 1, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
Go Back to Shorts
SRH
Gujarat Titans
Narendra Modi Stadium
Ahmedabad

More Telugu News