పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేన ప్రచారానికి నేను సిద్ధం: అనసూయ

  • తనకు నాయకులు ముఖ్యమన్న అనసూయ
  • నాయకుల అజెండాలు నచ్చితే మద్దతు ఇస్తానని వ్యాఖ్య
  • డేట్స్ కుదరకపోవడం వల్లే జబర్దస్త్ మానేశానన్న అనసూయ
తనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని సినీ నటి అనసూయ తెలిపారు. తనకు పార్టీలు ముఖ్యం కాదని... నాయకులు ముఖ్యమని అన్నారు. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు. తన మాట వినేవాళ్లు కొందరు ఉండటం తన అదృష్టమని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే కచ్చితంగా ప్రచారానికి వెళ్తానని... తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  

జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను మానేయడంపై ఆమె స్పందిస్తూ.. డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేశానని చెప్పారు. తనకు టైమ్ ఉన్నప్పుడల్లా సెట్స్ కు వెళ్తుంటానని తెలిపారు. గతంలో తనపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన కొంచెం పాత కాలం నాటి మనిషి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని చెప్పారు. తనపై ఆయనకు చాలా చనువు ఉందని... అందుకే తాను పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదని ఆయన అన్నారని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొంత మంది రకరకాలుగా రాశారని మండిపడ్డారు. కోట గారు తనను ఇంట్లో మనిషిగా భావించారు కాబట్టే అలా అన్నారని చెప్పారు.

Anasuya
Tollywood
Janasena

More Telugu News