హీరోయిన్ అదితీరావు హైదరీని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్

Love birds Siddharth and Aditi Rao Hydari got married
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, అదితి
  • వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వివాహం
  • అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు
తమిళ హీరో సిద్ధార్థ్, అందాల భామ అదితీరావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి రానివ్వలేదు. కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యాన్ని నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితీరావు హైదరీ ఒకరు. 

సిద్ధార్థ్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. 'మహా సముద్రం' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.
Go Back to Shorts
Siddharth
Aditi Rao Hydari
Tollywood
Kollywood

More Telugu News