Ramcharan: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నుంచి 'జరగండి' పాట విడుదల.. మీరూ చూసేయండి!

First song from Ram Charan Game Changer movie released
షార్ట్స్‌లో చూడండి
మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' నుంచి తొలి పాట విడుదలయింది. ఈరోజు చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి 'జరగండి జరగండి' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. చరణ్ సరసన కియారా అద్వానీ నటించింది. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఇప్పుడు విడుదలైన పాట... సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, తమన్ సంగీతాన్ని అందించారు. అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. తెలుగు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరోవైపు, 'జరగండి జరగండి' పాటను ఈరోజు 150 థియేటర్స్ లో పత్యేకంగా ప్రదర్శించనున్నారు. 

Go Back to Shorts
Ramcharan
Game Changer Movie
First Song
Jaragandi Jaragandi
Tollywood
Shankar
Kiara

More Telugu News