ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్... సీఎస్కేపై టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans won the toss against CSK
  • చెన్నైలో నేడు సీఎస్కే × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • గతేడాది ఫైనల్లో ఆడిన సీఎస్కే, గుజరాత్
ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. గత సీజన్ లో ఫైనల్లో ఆడింది ఈ రెండు జట్లే. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నెగ్గగా, గుజరాత్ రన్నరప్ గా నిలిచింది. 

ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, చెన్నై జట్టులో స్పిన్నర్ మహీశ్ తీక్షణ స్థానంలో వెర్సటైల్ పేసర్ మతీశ పతిరణ జట్టులోకి వచ్చాడు. గుజరాత్ జట్టు ఇటీవల ముంబయి ఇండియన్స్ పై గెలిచి మాంచి ఊపుమీదుంది. చెన్నై జట్టు కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరును ఓడించి విజయంతో ప్రస్థానాన్ని ఆరంభించింది.
Go Back to Shorts
IPL-2024
Gujarat Titans
CSK
Chennai

More Telugu News