హిందూపురం ఎంపీ, అసెంబ్లీ బరిలో ఇండిపెండెంట్ గా స్వామి పరిపూర్ణానంద!
- బీజేపీ నుంచి తనకు టికెట్ రాకుండా చంద్రబాబు చేశారని వ్యాఖ్య
- మైనార్టీ ఓట్లు పడవనే భావనతో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న పరిపూర్ణానంద
- ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టామని వెల్లడి
దక్షిణ భారతదేశంలో హిందూపురంది గొప్ప స్థానమని పరిపూర్ణానంద అన్నారు. హిందూపురం పేరులోనే హిందూ ఉందని... అందుకే హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరోవైపు హిందూపురం శాసనసభ అభ్యర్థిగా బాలకృష్ణ, లోక్ సభ అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు.