సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో ఐపీఎల్ రూల్స్ అతిక్రమించిన కోల్‌కతా ప్లేయర్.. భారీ ఫైన్ విధింపు
- మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధింపు
- హైదరాబాద్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో అనుచిత ప్రవర్తన
- ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బౌలర్ హర్షిత్ రాణా
‘‘ మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. అతడి మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించాం’’ అని ప్రకటించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా రెండు స్థాయి-1 నేరాలకు పాల్పడ్డాడని, సంబంధిత నేరాలలో ఒకదానికి మ్యాచ్ ఫీజులో 10 శాతం, మరొక దానికి 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నేరాలను రాణా ఒప్పుకున్నాడని, మ్యాచ్ రిఫరీ వద్ద అంగీకరించాడని తెలిపింది. లెవెల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని ప్రకటనలో ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది.