Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక అబ్బాయి పెళ్లి ప్రపోజల్ ఎలా పంపించాడో తెలుసా?: యూట్యూబర్ ఈఆర్ యామిని

Yamini Special
Advertisement
  • తన తండ్రి గురించి ఆలోచిస్తానన్న యామిని 
  • లవ్ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయని వెల్లడి 
  • పెళ్లి విషయంలో పేరెంట్స్ నిర్ణయమే ఫైనలని తేల్చేసిన యామిని 
  • మంచి హౌస్ వైఫ్ గా ఉండటమే ఇష్టమని వ్యాఖ్య  
Advertisement
ఈ ఆర్ యామిని .. యూట్యూబ్ ను ఫాల్ అయ్యేవారికి ఈ పేరు సుపరిచితం. స్వచ్ఛమైన నవ్వుతో .. తెలుగుదనానికి అద్దం పడుతున్నట్టుగా .. పల్లె అందానికి అర్ధం చెబుతున్నట్టుగా యామిని కనిపిస్తుంది. యూత్ లో ఆమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ .. "మా అమ్మానాన్నలు ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచారు" అని అన్నారు. 

" నేను నాకు సంబంధించిన ఏ వీడియో విషయంలో కూడా పొరపాటు జరక్కుండా చూసుకుంటాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మా ఫాదర్ కి మంచి పేరు ఉంది. నేను చేసే పొరపాటు వలన ఆయన పేరు దెబ్బతినకూడదు. అందువలన నా వీడియోలు పద్ధతిగా ఉండేలా చూసుకుంటాను. మా ఇంట్లో ఎవరం కూడా ఒకరిపై ఒకరం కోప్పడటం జరగదు. అందరం కూడా ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం. నాకు ఎప్పుడైనా కోపం వస్తే, అది తగ్గేవరకూ పక్కకి వెళ్లిపోతాను.. అంతే" అని చెప్పారు. 

" లవ్ ప్రపోజల్స్ .. పెళ్లి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. మొన్నీమధ్య ఒక అబ్బాయి పెళ్లి ప్రపోజల్ పంపించాడు. తన గురించి .. తన ఫ్యామిలీ గురించి ఒక లాంగ్ నోట్ బుక్ లో .. రెండు మీడియం నోట్ బుక్స్ లో రాసి పంపించాడు. అది చూసి మేమంతా నవ్వుకున్నాం. పెళ్లి విషయంలో అమ్మానాన్నల నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు మా పేరెంట్స్ ను నేను ఎలా చూసుకుంటున్నానో .. పెళ్లి తరువాత మా వారి పేరెంట్స్ ను కూడా అలాగే చూసుకుంటాను. ఏ విషయమైనా ప్రేమతో చెబితే వినడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మంచి హౌస్ వైఫ్ గా ఉండాలనే నేను కోరుకుంటున్నది కూడా" అని అన్నారు. 
Advertisement
Advertisement
Yamini
Youtuber
Interview

More Telugu News