TSEAPCET: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో ముందుగానే ఈఏపీసెట్.. లేటుగా ఈసెట్

  • షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు టీఎస్ఈఏపీసెట్
  • మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచే పరీక్షలు మొదలు
  • ఐసెట్‌ జూన్ 5, 6 తేదీలకు మార్పు
Telangana govt postpones ICET exams and TSEAPCET starts from May 7th

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా, మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (వెటర్నరీ మొదలైనవి) కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉంది. 

రాష్ట్రంలో మే 13 నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా..  మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా, జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది.

More Telugu News