Gold: మీ ఒళ్లు బంగారం కానూ!.. మన శరీరంలోనూ పుత్తడి!

  • మన శరీరం మూలకాల నిర్మితం
  • మన శరీర బరువులో సగానికి పైగా ఆక్సిజన్
  • 0.2 శాతమే ఉన్నా సోడియం పాత్ర ఎంతో కీలకం
  • 70 కిలోల మనిషిలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం
Our Body Made From Gold Do You Know

బంగారం.. ఇప్పుడీ పేరు వింటే మహిళల గుండెలు గుభేల్‌మంటున్నాయి. ఎన్నడూ లేనంత వేగంగా దాని ధర పెరుగుతూ పోతుండడమే అందుకు కారణం.  పసిడి వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛకు సంకేతమే కాదు.. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కూడా.  ఇలాంటి పుత్తడి మన శరీరంలోనే ఉంటే. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం.

ప్రకృతిలోని ప్రతి పదార్థమూ మూలకాల కలయికేనన్న సంగతి మనకు తెలిసిందే కదా. మన శరీరం కూడా అందుకు భిన్నం కాదన్న సంగతి మీకు తెలుసా? ప్రకృతిలోని 118 మూలకాల్లో శరీరంలో ఉన్నవి మాత్రం ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్‌. ఈ నాలుగింటితోనే మన శరీరం రూపుదిద్దుకుంది. వీటికి తోడు కొద్ది మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. మన బరువులో 97 శాతం ఆక్రమించేవి ఈ నాలుగు మూలకాలే. వీటిలో ఒక్క ఆక్సిజన్ బరువే సగానికిపైగా ఉంటుంది. 

కొన్ని మూలకాలు అతి తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ శరీరానికి చాలా కీలకం. వీటిలో సోడియం పాత్ర చాలా ముఖ్యమైనది. మన శరీర బరువులో అది ఉండేది 0.2 శాతమే. కానీ, అది కొంత తగ్గినా, పెరిగినా కూడా ముప్పే. ఇక ముందే చెప్పుకున్నట్టు మన శరీరంలో బంగారం కూడా ఉంటుంది.  70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాములు ఉంటుంది.  మరి మిగతా మూలకాలు ఏయే పాళ్లలో ఉంటాయి? మన శరీరంలో ఎంత బరువును అవి ఆక్రమించాయన్న పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

More Telugu News