Amit Shah Fake Video: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్ షా చెబుతున్నట్టుగా మార్ఫింగ్ వీడియో.. నేడు దేశవ్యాప్తంగా అరెస్టులు!

  • తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నట్టుగా అమిత్ షా ఫేక్ వీడియో
  • ఒరిజినల్ వీడియోను షేర్ చేసిన బీజేపీ
  • తెలంగాణలో ముస్లింలు అనుభవిస్తున్న రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్లను మాత్రమే తొలగిస్తామని షా చెప్పారని వివరణ
Union Minister Amit Shah Fake Video Goes Viral BJP Files Case

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దుమారం రేగడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మార్ఫింగ్ చేసి, వీడియోను వైరల్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అమిత్ షా మాట్లాడిన అసలు వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలంగాణలో ముస్లింలకు ఉన్న రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారని, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారని వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని అమిత్ షా చెబుతున్నట్టుగా ఉంది. ఈ ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నేడు దేశవ్యాప్తంగా అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News