తెలంగాణ బీజేపీ నేతకు ఏపీలో టికెట్ ఇచ్చిన చంద్రబాబు!
- టీఎస్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్
- వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కృష్ణప్రసాద్
- బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ను కృష్ణప్రసాద్ ఆశించారు. అయితే, ఆయనకు టికెట్ దక్కలేదు. తాజాగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ను ఆయన ఆశించారు. చివరకు ఏపీలో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.