బీజేపీ మూడో జాబితా విడుదల... చెన్నై సౌత్ నుంచి తమిళిసై, కోయంబత్తూర్ నుంచి అన్నామలై పోటీ
- తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల
- నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పోటీ
- కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ పోటీ
ఈ జాబితా ప్రకారం కోయంబత్తూర్ నుంచి అన్నామలై, చెన్నై సౌత్ నుంచి తమిళిసై సౌందరరాజన్, నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పోటీ చేయనున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ సెల్వం, వేలూరు నుంచి ఏసీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సీ నరసింహన్, పెరంబలూరు నుంచి టీఆర్ పరివేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.