బీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా... త్వరలో కాంగ్రెస్‌లో చేరిక

బీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా... త్వరలో కాంగ్రెస్‌లో చేరిక

Puranam Sathish Kumar resigns from brs
  • బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్
  • త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడి
  • టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారని వ్యాఖ్య
  • అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పిన మాజీ ఎమ్మెల్సీ
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసన మండలి మాజీ సభ్యుడు పురాణం సతీష్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారన్నారు. ఇలా పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు.
Advertisement
BRS
Congress
Adilabad District

More Telugu News