ఈడీ రిమాండ్‌ను రద్దు చేయండి: సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
- కవిత తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
- కవితను వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది
- ములాఖత్ సమయంలో కవితను కలిసి వెళ్లిన కేటీఆర్
పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని... ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కవిత ఈడీ కస్టోడియల్ విచారణ నేడు మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.
కవితను కలిసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సాయంత్రం తన సోదరి కవితను ఈడీ కార్యాలయంలో కలిశారు. ములాఖత్ సమయంలో సోదరితో మాట్లాడి వెళ్లిపోయారు.