తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Light to Moderate Rain or Thundershowers in telangana
తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని... గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రేపు ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.
Go Back to Shorts
weather
Telangana
rain

More Telugu News