పేరడీ అకౌంట్ ట్వీట్ కు ఆసక్తికరంగా స్పందించిన అశ్విన్

Ashwin reacts funny to a parody account tweet
  • మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ కు, అశ్విన్ కు మధ్య చాన్నాళ్లుగా మనస్పర్ధలు
  • అశ్విన్ 500 వికెట్ల మైలురాయి సమయంలోనూ ఇరువురి మధ్య వాగ్బాణాలు
  • తాజాగా ఓ పేరడీ ట్వీట్ కు ఫన్నీగా బదులిచ్చిన అశ్విన్ 
టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు, మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కు మధ్య మనస్పర్థలు అందరికీ తెలిసిందే. గతంలో అశ్విన్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు గుప్పించిన శివరామకృష్ణన్... ఇటీవల అశ్విన్ 500 వికెట్ల మైలురాయి నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

అభినందించేందుకు తాను ఫోన్ చేస్తే అశ్విన్ కాల్ కట్ చేశాడని ఆరోపించాడు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడని, మెసేజ్ పంపించినా రిప్లయ లేదని తెలిపాడు. ఇదీ... మాజీ క్రికెటర్లకు వీళ్లిచ్చే గౌరవం! అంటూ అశ్విన్ పై రుసరుసలాడాడు. 

ఈ నేపథ్యంలో, అశ్విన్ ఓ పేరడీ అకౌంట్ లో వచ్చిన మీమ్ కు స్పందించాడు. అందులో శివరామకృష్ణన్ ఫొటో మీద కాల్ మీ ప్లీజ్ అని రాసి ఉంది. దీనిపై అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఓకే సర్... ఎక్కడ, ఎప్పుడు అనేది నిర్ణయించిన తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.

అశ్విన్, శివరామకృష్ణన్ ఇద్దరూ తమిళనాడుకు చెందినవారే అయినప్పటికీ, తన సలహాలను అశ్విన్ స్వీకరించడంలేదన్న కోపం శివరామకృష్ణన్ లో ఎప్పటినుంచో ఉంది.
Go Back to Shorts
Ravichandran Ashwin
Laxman Sivaramakrishnan
Cricket
Team India
Tamil Nadu

More Telugu News