Devi: నగలు తాకట్టుపెట్టి ఆ సినిమా తీశాను: నిర్మాత ఎమ్మెస్ రాజు

  • ప్రేమ ప్రధాన పాత్రగా నటించిన 'దేవి'
  • రీసెంటుగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సినిమా 
  • నిర్మాతగా పడిన కష్టాలను ప్రస్తావించిన ఎమ్మెస్ రాజు 
  • గ్రాఫిక్స్  పరంగా అనుభవం లేక ఇబ్బంది పడ్డానని వెల్లడి
MS Raju Interview

నిర్మాతగా ఎమ్మెస్ రాజు భారీ విజయాలను అందుకున్నారు. అప్పట్లో ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే, అది పెద్ద సినిమాగా అంతా భావించేవారు. తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించేవారు. అలా ఆయన నిర్మించిన సినిమాలలో 'దేవి' ఒకటి. ప్రేమ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా అప్పట్లో ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమా మార్చి 12తో పాతికేళ్లను పూర్తిచేసుకుంది. 

"ఈ సందర్భంగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ తో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. "ఒక రోజున నాకు కలలో పాములు కనిపించాయి. అప్పుడే నాకు పాములపై సినిమా తీస్తే ఎలా ఉంటుందా అనిపించింది. అదే విషయం కోడి రామకృష్ణగారికి చెబితే ఆయన కథను రెడీ చేసుకున్నారు. కోటిన్నరతో సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనతో రంగంలోకి దిగాను. గ్రాఫిక్స్ చేయించాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన సీన్స్ ను ముందుగా పూర్తి చేయాలనే విషయం తెలియకపోవడం వలన ఆలస్యమైపోయింది" అన్నారు. 

"గ్రాఫిక్స్ కి ఒక పాతిక నుంచి యాభైవేలు కావొచ్చని అనుకుంటే, మొత్తం పూర్తయ్యేసరికి మూడున్నర కోట్లు అయింది. కానీ అప్పటికి అంతడబ్బు నా దగ్గర లేదు. వాళ్లకి ఏదో చెప్పి బ్రతిమాలుకున్నాను. అదే సమయంలో డీటీఎస్ వచ్చింది. ఈ సినిమాను డీటీఎస్ లో చేయడం కోసం ఇంట్లో ఉన్న మిగతా బంగారం కూడా అమ్మేశాను. అలా ఎన్నో కష్టాలుపడి తీసిన సినిమా అది" అని చెప్పారు. 

More Telugu News