YS Sharmila: సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి ష‌ర్మిల తీవ్ర‌ విమ‌ర్శ‌లు

  • పాయ‌క‌రావుపేట‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న‌ వైఎస్ ష‌ర్మిల
  • వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోసిన వైనం
  • మోదీని నిల‌దీసే ధైర్యం రాష్ట్ర నేత‌ల‌కు లేద‌ని విమ‌ర్శ‌
  • అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క ఉద్య‌మ‌మైనా చేశారా? అంటూ నిల‌దీత‌
  • రైతుల‌కు అన్యాయం జ‌ర‌గుతుంటే సీఎం ఏం చేస్తున్నారని మండిపాటు
YS Sharmila once again Criticizes CM Jagan

అన‌కాప‌ల్లి జిల్లా పాయ‌క‌రావుపేట‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగిస్తూ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే యువ‌తకు ఉద్యోగాలు వ‌చ్చేవ‌న్నారు. మోదీని నిల‌దీసే ధైర్యం రాష్ట్ర నేత‌ల‌కు లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డితే తెరిపించాల‌నే ఆలోచ‌న పాల‌కుల‌కు ఉందా? అని ప్ర‌శ్నించారు. 

ఇంకా ష‌ర్మిలా మాట్లాడుతూ.. "అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క ఉద్య‌మ‌మైనా చేశారా? రాజ‌ధాని క‌ట్ట‌గ‌లిగారా? రాజధాని నిర్మించ‌లేని నేత‌ల‌కు ఎందుకు ఓట్లు వేయాలి? రైతుల‌కు అన్యాయం జ‌ర‌గుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? కుంభ‌క‌ర్ణుడు ఆరు నెల‌లే నిద్ర‌పోతాడు. మీరు ఐదేళ్లు నిద్ర‌పోయి ఎన్నిక‌ల‌ప్పుడు లేచారా? సిద్ధ‌మంటూ బ‌య‌ల్దేరారు. దేనికి అప్పులు చేయ‌డానికా? మెగా డీఎస్‌సీ అని ద‌గా చేసి డీఎస్‌సీ ఇచ్చారు. మ‌ద్యపాన నిషేధం చేయ‌క‌పోతే ఓట్లే అడ‌గ‌న‌న్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం అమ్ముతోంది. నాసిర‌కం మ‌ద్యం తాగి ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు" అని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు.

More Telugu News