Cricket vs Baseball: క్రికెట్ రాన్రానూ బేస్‌బాల్ గేమ్‌లా మారిపోతోంది.. పంజాబ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

  • గత రాత్రి కేకేఆర్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం
  • బ్యాటర్ల దూకుడుతో క్రికెట్ కాస్తా బేస్‌బాల్ గేమ్ అయిపోయిందన్న శామ్ కరన్
  • ఈ టోర్నీ ద్వారా శశాంక్ వంటి అద్భుతమైన ఆటగాడు దొరికాడని ప్రశంస
Cricket turning as Baseball said Sam Curran

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 261 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక పరుగుల మూడో మ్యాచ్. 

మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ మాట్లాడుతూ.. క్రికెట్ రోజురోజుకు బేస్‌బాల్ గేమ్‌లా మారిపోతోందని పేర్కొన్నాడు. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోరును సాధించినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్‌లో బ్యాటర్ల దూకుడు పెరుగుతుండడంతో క్రికెట్ కాస్తా బేస్‌బాల్ గేమ్‌ను తలపిస్తోందన్నాడు. ఇకపై ప్రతీ గేమ్ తమకు ఎంతో కీలకమని, కాబట్టి తమ కుర్రాళ్లు అందుకు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాడు. బెయిర్‌స్టో, శశాంక్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఈ టోర్నీ ద్వారా శశాంక్ వంటి అద్భుతమైన క్రికెటర్ తమకు లభించాడని కొనియాడాడు. అశుతోష్ సహా కుర్రాళ్లందరూ అద్భుతంగా ఆడారని శామ్ ప్రశంసించాడు.

More Telugu News