ట్రెండింగ్‌లో 'RIP హార్దిక్ పాండ్యా'.. రోహిత్ ఫ్యాన్స్ ఇప్పట్లో పాండ్యాను వదిలిపెట్టేలా లేరుగా..!
- ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ప్రెస్‌మీట్
- ముంబై ప్రెస్మీట్లో పాల్గొన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ మార్క్ బౌచర్
- ఈ ప్రెస్మీట్లో హిట్‌మ్యాన్‌కు సంబంధించి ఎదురైన ప్రశ్నలు దాటవేత
- కెప్టెన్, కోచ్ తీరుపై మండిపడుతున్న రోహిత్ అభిమానులు
ఇదిలాఉంటే.. 2022లో హార్దిక్ పాండ్యా ముంబైని వదిలి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లాడు. అక్కడ కెప్టెన్‌గా బాధ్యతలు కూడా దక్కాయి. అతని సారథ్యంలోనే గుజరాత్ 2022లో ఐపీల్ టైటిల్ కూడా గెలిచింది. అలాగే 2023లో ఫైనల్ వరకు వెళ్లింది. ఫైనల్లో చెన్నై చేతిలో పరాజయంతో రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఇక ట్రేడింగ్‌లో భాగంగా ముంబై ఫ్రాంచైజీ తిరిగి పాండ్యాను జట్టులోకి తీసుకుంది. అంతటితో ఆగకుండా ఏకంగా కెప్టెన్‌గా నియమించింది. అంతే.. అప్పటినుంచి ముంబై యాజమాన్యంపై రోహిత్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా తొలగించడం ముంబై చేసిన అతి పెద్ద తప్పు అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ చెబుతోంది.