రాజమౌళికి జపాన్ వీరాభిమాని అపురూప కానుక
- జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం
- రాజమౌళి కోసం 1000 ఒరిగామి బొమ్మలు తయారుచేసిన వృద్ధురాలు
- ముగ్ధుడైన టాలీవుడ్ దర్శకధీరుడు
కాగా, జపాన్ కు చెందిన ఓ వీరాభిమాని గురించి రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారుచేసి తమకు ఇష్టమైన వారికి కానుకగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్ కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. ఆమె ఇప్పుడే మాకు ఒరిగామి బహుమతిని పంపించి, మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు మనం కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం!" అంటూ రాజమౌళి వివరించారు.

