Magadheera: మళ్లీ వస్తున్న 'మగధీర'... రీ రిలీజ్ ఎప్పుడంటే...!

Magadheera set to re release on Mar 26
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీర చిత్రం మళ్లీ విడుదలవుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీర చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. 

ఈ సందర్భంగా శ్రీ విజయలక్ష్మి  ట్రేడర్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. 

తమను ప్రోత్సహించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 

తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి ఆదరించి ఘన విజయాన్ని అందించాలని, తద్వారా రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నామని తెలిపారు.
Go Back to Shorts
Magadheera
Re Release
Ram Charan
Birthday
Rajamouli
Allu Aravind
Tollywood

More Telugu News