పడిపోయిన ఫ్లిప్ కార్ట్ విలువ!
- రెండేళ్ల కిందట ఫ్లిప్ కార్ట్ విలువ రూ.3.3 లక్షల కోట్లు
- ఈ ఏడాది జనవరి నాటికి రూ.41 వేల కోట్ల పతనం
- ఫోన్ పే విడిపోవడమే కారణం!
2016లో ఫోన్ పే సంస్థను ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇవి రెండు వాల్ మార్ట్ అధీనంలోకి వెళ్లాయి. అయితే, 2022లో ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ విడిపోయాయి. ఈ పరిణామం ఫ్లిప్ కార్ట్ విలువపై ప్రభావం చూపినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
2021లో ఫ్లిప్ కార్ట్ విలువను మదింపు చేయగా, అప్పుడు ఫోన్ పేను కూడా కలుపుకుని విలువ లెక్కగట్టారు.